వానర వీరుడు, వాయు నందనుడు
అతి బలవంతుడు, అమిత సుందరుడు
మేఘ చుంబితమౌ లంబ శిఖరము నుండి
రాత్రి సమయమున లంకను చేరెను ..1,2
ఆకాశపుటంచులు తాకు సౌధముల తోనూ
అద్భుత సుందర భవనములతోనూ
కెరట ఘొషలను పోలు హోరులతోనూ
చల్లని సముద్ర పవనములతోనూ
కుబేర పట్టణమగు వితపతి పోలికతోనూ
శస్త్ర అస్త్ర ధారులగు సైనిక రక్షణతోనూ
మదగజ రక్షిత రహదారులతోనూ
నాగులచే పరిరంక్షించబడు భోగవతి వలెనూ
విచిత్ర కాంతుల వెలుగుల తోనూ
ఇంద్రుని అమరావతిని పోలు మరీచికలతోనూ
పటిష్టమగు బంగారు ప్రహరీలతోనూ
ద్వజ పతాక గంటల తోరణములతోనూ
కన్నులకింపుగ వెలుగొందు చున్న దగు
లంకను చేరి ఆనందము ఉప్పొంగ
మారుతి గోడలపైకి అటునిటు దుమికే ...3,7
బంగారు మెరుగుల ద్వారములతో
వైఢూర్యములు పొదిగిన చావడులతో
వజ్రములు విసరబడిన ముంగిళ్ళతో
నవరత్నములతో అలంకృతమైన లోగిళ్ళతో
మేలిమి బంగారు ఏనుగు శిల్పములతో
వెండి మొదలగు లోహ మిశ్రిత కుందులతో
కెంపులు పొదగబడిన సోపానములతో
కళంక రహిత అద్దములమర్చిన నృత్య శాలలతో
క్రౌంచ మిధున నెమళ్ళ కూతలతో
తెల్లని హంసల సమూహములతో
సన్నాయి నాదస్వర మంగళ ద్వనులతో
గగన గమనము చేయుచున్న
వసవౌకసార పట్టణమువలే
వెలుగొందు చున్న లంకా నగరమును చూసి
మారుతి ఆనంద ఆస్చర్యముల గంతులేసెను ...8,12
అతి సుందరముగనూ అతి పవిత్రముగనూ
అద్భుత సంపద సహితమునూ
రావణ పాలితమునూ అగు లంకను చూసి
హనుమ మదిన ఇట్లు తలచెను ..13
"కుముదుడునకు అంగదునకు
వానర శ్రేస్ఠుడు సుశేనునకు
మైందునకు మరి ద్వివిదునకు
సూర్య పుత్రుడు సుగ్రీవునకు
వానర వీరుడు కుశపర్వునకు
వానర దళపతి రిక్షునకు
మరి నాకును, దీర్ఘ భ్హహుడు
రామచంద్రునకు, పౌరుష
సహితుడు లక్ష్మణునకును కాక
మరి ఎవ్వరి బలమునకు లొంగదు
ఈ రాక్షస రక్షిత లంకయని
తలచిన మారుతి సంతసించెను 14..17
వజ్రములన్ని వస్త్రముగానూ
కోశాగారము కమ్మలగాను
ఆయుధ శాలలు వక్షముగానూ
లంకను మొత్తము ఒక స్త్రీ గానూ
మారుతి చూసెను, అచ్చెరువొందెను
దీపపు థళ థళ, వజ్రపు మిల మిల
చీకటి తరిమెను ఉషహ్ కాంతి వలె ...18,19
లంకకు కావలి ఉన్నొక రాక్షసి
చిన్నగ వుండి, లంకలో తిరుగుతు
అటునిటు తచ్చాడి, ఎదో వెదుకుచు
అమిత బలశాలియగు, హనుమను చూసెను ...20
నిలు నిలు అనుచు వికృత రూపుతొ
ముందుకు దుమికెనూ హనుమను ఆపుతూ
పెద్దగ గర్జించెను కనులెర్ర చేసెను
పిడికిలి బిగించెను పళ్ళు పటపట కొరికెను
రోషము క్రక్కుచు హనుమను చూచుచు
క్రొధ స్వరమున ఇట్లు పలికెను 21,22
" ఓ వన సంచారీ, ఓ వాల ధారీ,
నీవెవ్వరవు? ఇట కేల వచ్చితివి?
నిజము చెప్పుమూ అసువులు బాయకు.
సాధ్యము కాని పని లంకను చేరుట
అన్ని మార్గములు, రక్షిత మైనవి
తగని పని ఇది, ఓ వానరమా " 2324
"తప్పక చెప్పెద నీవడిగినవి !!
ముందు చెప్పుము ఎందుకాపితివి ?,
ద్వారముకడ నిల్చితి వెందుకు ?,
భయంకరమగు రూపమెందులకు ?
నిప్పులు కురియు కన్నులుగల దానివి
నీవు ఎవ్వరివి ముందు చెప్పుము ?
అనుచు మారుతి బిగ్గరగా అడిగెను 2526
ఇచ్చా రూపము దాల్చ శక్తి గలిగిన
లంఖిణి విన్నది, హనుమ మాటలు
కోపము చూపుచూ ఇట్లు పలికెను
"లంకకు కావలి వుండు దానను
రావణ ఆజ్ఞలను పాలించు దానను
ఓటమెరుగనీ పరాక్రమ శాలిని
ఎదురు ప్రశ్నలు సహించని దానిని
మాట వినని నిను మట్టుపెట్టెద
ఒక్క గుద్దుతో మట్టి కరిచెదవు
శాశ్వత నిద్రకు పాత్రుడగుదువు
ఓ వానరాధమా, లంకకు రక్షణ నేను చేసెదను" 2830
లంఖిణికెదురుగా స్థిరముగ నిలచి
పలికిన మాటలు స్రద్ధగ ఆలకించి
బుద్ధి శాలియూ, అమిత వీరుడునూ
నిశిత దృష్టితో లంకిణి చూచుచు
మంద్ర స్వరమున ఇటుల పలికెను.
"లంకలో వున్న పెద్ద కట్టడములు
సుందర మైన ఆ రహదారులు
అద్భుత వనములు, తటాకాదులు
అడవులు మరియు ముఖ్య భవనములు
చూడవలెనన్న కోరిక గలిగెను
అందుకే వచ్చితీ నను విడువు" 3134
అది విని లంఖిణి కోపముతో ఊగెను
కఠిన పలుకులు ఇట్లు పలికెను
"కుతంత్ర బుద్ధిగల ఓ వానరమా
లంక జొచ్చుట నీ తర మవదు
నను ఓడించియే ముందుకు పోగలవు" 3536
"లంకను చూచుటకే నేను వచ్చితిని
చూసిన పిమ్మట తిరిగి వెళ్ళుదును
ఈ ఒక సారికి అనుమతించుమూ"
అని పలికె హనుమ లంఖిణి తోడను 37
అది విన్న లంఖిణి ఉక్రోషముతో
సింహ నాదము ఒకటి చేసెను
పిదికిలి బిగించెను పైకి ఉరికెను
అతిబలమగు ఒక చరుపు చరిచెను 38
పిడికిలి తగిలిన వానర కేసరి
బాధగ అరచెను అతి బిగ్గరగా
అతి కోపముతో కన్నులు తిరిగెను
ఎడమ పిదికిలి బిగించెను పైకి ఎగిరెను,
"ఆడది అది" యని ఆలోచనతో
కోపము చూపక, తలపై మోదెను 3940
దెబ్బకు లంఖిణి నేల కొరిగెను
బిక్క మొగముతో సగము చచ్చెను.
నేలకొరిగిన లంఖిణి చూచుచు
ఆడది అదియని దయచూపె హనుమ
గర్వము చచ్చి, చావుని చూసి
మంద్ర స్వరమున, లంఖిణి పలికెను 4143
"ఓ వానరోత్తమా నేనే లంకను
ఓ బల శాలీ, నీ చేత ఓడితి
పూర్వ కాలమున నాకొక వరమును
బ్రహ్మదేవుడు ఇచ్చి వుండెను
నీకది తెలిపెద శ్రద్ధగా వినుము
"నీవొక కోతితో ఒడిన దినము
రాక్షస జాతికి పతనము తద్ధ్యము!!"
నీరాకతో ఆ దినము వచ్చినది
బ్రహ్మ వరమునకు ఎదురెట్లుండును ?
రావణ పతనము ఇక దరికొచ్చెను
సీత వలననే రాక్షస నాశము
వానరోత్తమా అడ్డిక ఎవరు? లంకను చేరుము,
ఇచ్చతొ తిరుగుము సీతను వెదుకుము,
శాపగ్రస్తమిక లంకా నగరము,
నాశము దీనికి దాపురించినది .. 4451
Wednesday, January 3, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment